10, డిసెంబర్ 2012, సోమవారం


రంకాయితాలు 

మంచిపనే చేసారు 
మానవపధ నిర్దేశకులు 
ప్రపంచాన్ని కొట్టి కొట్టి నలగ్గొట్టి 
(ఈజ్ ఇమాస్కులేషన్ ఎ సిన్ ? )
అవసరమేలే అణిచేందుకు
పొగరుబోతు తత్వాన్ని . 
ఎంతకాలం చేస్తాం వస్తుమార్పిడి !
వృత్తులన్నీ సంకరమయాక ,
రాక్షసగణాల ఊపిరిలో 
విలీనమై లుప్తమయాక :
కోడెగిత్తలకు ముకుదాడు 
సర్వదా శ్రేయస్కరం ,
నిలబెట్టేందుకు జాతిని !
నిరంతరం ,,, తరం ... తరం.
నిగూఢ స్వప్నాలు 
వాంఛా సౌఖ్యాలు 
పురిగొల్పుతూ 
పతనమౌతూ 
అంతఃచేతనల 
మానసిక వ్రణాలు 
కనుగీటుతూ ...